వ్యక్తుల కదలికలపై నిఘా నిజమే
వినియోగదారులు లొకేషన్ డాటా ఆప్షన్‌ను ఎంచుకోనప్పటికీ, కొన్ని యాప్‌లు లొకేషన్‌ను ట్రాప్ చేయడంపై గూగుల్ వివరణ ఇచ్చింది. లొకేషన్ డాటాను టర్న్ ఆఫ్ చేసినప్పటికి తమ వివరాలను కొన్ని యాప్‌లు ట్రాక్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదురైన నేపథ్యంలో గూగుల్ వివరణ ఇచ్చింది. గూగుల్‌తో అనుభవాన్ని మెరుగుపరిచేందుకు లొకేషన్ డాటాను ట్రాక్ చేస్తున్నట్లు తన హెల్ప్ పేజిలో వివరణ ఇచ్చింది. అంతకుముందు వినియోగదారులు, లొకేషన్ హిస్టరీని, తమకిష్టమైనప్పుడు టర్న్ఆఫ్ చేసుకోవచ్చునని, మీరు వెళ్ళిన ప్రదేశాలు స్టోర్ కావు అని హెల్ప్ పేజీలో పేర్కొంది.
ఇప్పుడు మాత్రం గూగుల్ లోకేషన్ సేవలు, ఫైండ్ మై డివైజ్ ఇతర లొకేషన్ సేవలపై ఈ సెట్టింగ్ ప్రభావం చూపదు అని తెలిపింది. సెర్చ్ అండ్ మాప్స్ వంటి కొన్ని ఇతర సేవలలో భాగంగా కొంత లొకేషన్ డేటాను సేవ్ చేయబడుతుందని తెలిపింది. అయితే హెల్ఫ్ పేజీని పునరుద్ధరించిన తరువాత కొన్ని గూగుల్ యాప్స్ ద్వారా మీ లొకేషన్ ట్రాక్ చేయబడుతోందని న్యూ లాంగ్వేజ్ ధ్రువీకరించింది. లొకేషన్ హిస్టరీకి సంబంధించిన కొత్త లాంగ్వేజ్‌ను ఆప్డేట్ చేశాం. అది మా హెల్ప్ సెంటర్లు, ప్లాట్‌ఫారంలపై మరింత సుస్థిరంగా, సృష్టంగా ఉంటుంది అని గూగుల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నట్లు సిఎన్ఇటి తన కధనంలో పేర్కొంది.













