మెయిల్స్ ఇక భద్రం…
సాంకేతిక టెక్నాలజీ వచ్చిన తరువాత మనం వాడే జీమెయిల్స్ ఎంతవరకు భద్రమో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దాంతో ఇతర వ్యక్తులు దొంగతనంగా మెయిల్‌ను ఓపెన్ చేసి చదువొచ్చు. కాపీ లేదా ఫార్వర్డ్ చేయడం, ప్రింట్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన జీమెయిల్లో సరికొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కానీడెేన్షియల్ మోడ్‌ను అందుబాటులోకి తేనున్నట్టు ద వెర్జ్ అనే వెబ్సైట్ ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం కాన్ఫిడెెన్షియల్ మోడ్ ద్వారా పంపే మెయిల్స్‌ను అవతలి వ్యక్తులు ఫార్వర్డ్/కాపీ/ప్రింట్ చేయలేరు. అంతేకాకుండా ఈ మోడ్ ద్వారా పంపే మెయిల్‌ను ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి. ఇది మెయిల్ పంపేటప్పుడే టెక్స్ మెసేజ్ రూపంలో అవతలి వ్యక్తులకు చేరుతుంది. ఈ రహస్య మోడ్ నుంచి పంపే మెయిల్స్‌కు గడువు విధించే ఆలోచనలో కూడా గూగుల్ ఉన్నది. అంటే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆ మెయిల్ ఇక కనిపించదు. దీంతోపాటు మరిన్ని ఫీచర్లను కూడా గూగుల్ కల్పించనున్నది.













