ఆల్ఫాబెట్‌కు సుందర్‌పిచాయ్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు సీఈవోగా బాధ్యతలు చేపడుతున్న భారత సంతతి టెక్ నిపుణుడు సుందర్‌పిచాయ్ మరో ఘనత సాధించారు. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా నియమితులయ్యారు. గూగుల్ సీఈవో బాధ్యతలను సుందర్ ఎంతో సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆల్ఫాబెట్ బోర్డులో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. సుందర్‌తో కలిసి పనిచేయడాన్ని నేను ఎంతగానో ఇష్టపడతాను అని ఆల్ఫాబెట్ సీఈవో ల్వారీ పేజ్ అన్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన సుందర్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారు. 2004లో గూగుల్ చేరిన ఆయన, సంస్థ అనేక విభాగాల్లో సేవలందించారు. గూగుల్ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్‌తో కలిసి పనిచేశాడు. 2015 ఆగస్టులో సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సుందర్ నేతృత్వంలో గూగుల్ యాడ్స్ అండ్ యూట్యూబ్ అమ్మకాలు బాగా పెరిగినట్లు సంస్థ చెబుతోంది.













