గూగుల్ నుంచి ఇకపై ఈ సేవలు అందవు
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పొట్టి యుఆర్ఎల్ (అసలు యుఆర్ఎల్ చిరునామాలకు బదులు కుదించిన చిన్న యుఆర్ఎల్) సేవలు జిఒఒ.జిఎల్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యూజర్లు, గుర్తు తెలియని యూజర్లు ఇకపై జిఒఒ.జిఎల్ లింక్‌లను ఈ నెల 13 తరువాత క్రియేట్ చేసుకోవడం సాధ్యం కాదని గూగుల్ సృష్టం చేసింది. అయితే, ప్రస్తుత యూజర్లకు మాత్రం వెసులుబాటు కల్పించింది. మరొక ఏడాది పాటు ఈ సేవలు పొందవచ్చని సంస్థ సూచించింది. ఆ తరువాత వారికి కూడా ఈ సేవలు అందుబాటులో ఉండవని సృష్టం చేసింది. గూగుల్ యుఆర్ఎల్ షార్టెనర్ను 2009లో ప్రారంభించింది. యుఆర్ఎల్ లింకులను తేలిగ్గా షేర్ చేసుకునేందుకు, ఆన్లైన్ ట్రాఫిక్ పెంచేందుకు ఇలా చేయడం జరిగింది. అయితే, నాటి నుంచి ప్రముఖ పొట్టి యుఆర్ఎల్ సేవలు చాలానే అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఇంటర్నెట్లో కంటెంట్ పొందే తీరు కూడా మారిపోయింది. దీనితో ఈ సేవలను నిలిపివేయాలని నిర్ణయించాం అని గూగుల్ తెలిపింది.













