హైబ్రీడ్ వర్క్ ఫ్రం హోం మోడల్స్ లో పనిచేస్తాం
గూగుల్ ఉద్యోగులు భవిష్యత్‌లో హైబ్రీడ్ వర్క్ ఫ్రం హోం మోడల్స్ లో పనిచేస్తున్న కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హైబ్రీడ్ మోడల్స్ లో కార్యాలయాలు పునర్వ్యవస్థీకరణ, మరింత దీర్ఘకాలంపాటు ఇంటి నుంచే పనిచేసే విధానాలను గుర్తించడం ఉంటాయని ఆయన వివరించారు. భవిష్యత్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించాలన్నా, ఏదైనా కొత్తదాన్ని సృష్టించాలన్నా సిబ్బంది ఉమ్మడిగా ఒక చోట ఉండడం ఎంతో ముఖ్యమని మేము ధృడంగా నమ్ముతున్నాం. కాబట్టి భవిష్యత్‌లో 100 శాతం వర్క్ ఫ్రం హోం లేదా ఇతర విధానాలు ఉంటాయని మేము భావించడం లేదు.
అయితే మరింత సౌకర్యవంతమైన, హైబ్రీడ్ మోడల్స్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఉద్యోగులు కొన్ని రోజుల్లో కార్యాలయానికి వచ్చి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిన వారి కోసం ఆయా ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్‌ను తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదిలా వుండగా తమ సిబ్బందిలో 60 శాతం మంది ఆఫీస్‌కు రావాలని భావిస్తున్నారని, అయితే ప్రతి రోజు ఆఫీస్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో అభిప్రాయం వ్యక్తమైందని గూగుల్ వెల్లడించింది.













