అంధత్వానికి లెన్స్ చికిత్స
మధుమేహంతో వచ్చే అంధత్వాన్ని సులువుగా తగ్గించే లెన్స్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇప్పటివరకు అంధత్వాన్ని తగ్గించేందుకు లేజర్ చికిత్సతో పాటు కనుగుడ్డులోకి ఇంజక్షన్ ఇచ్చే విధానం అందుబాటులో ఉంది. అయితే ఇది నొప్పితో కూడిన చికిత్స. కాబట్టి నొప్పిలేకుండా అంధత్వాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు గ్లో ఇన్ ది డార్క్ కాంటాక్ట్ లెన్స్‌ను రూపొందించారు. సాధారణంగా మధుమేహం ఉన్నవారి కంటిలో రక్తనాళాలు దెబ్బతిని రెటీనాకు అవసరమైన ఆక్సిజన్ అందక, చూపు మందగిస్తుంది. ఈ లెన్స్ ద్వారా రాత్రి వేళల్లో రెటినాకు అవసరమైన ఆక్సిజన్ డిమాండ్ తగ్గించి అంధత్వాన్ని దూరం చేయవచ్చని చెప్పారు.













