అమెరికా పర్యటనలో విజయ్ గోఖలే
భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే అమెరికాకు చేరుకున్నారు. అమెరికాలో ఆయన మూడు రోజులు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక అంశాలతో పాటు వ్యూహాత్మక భద్రతా అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతోనూ, అమెరికా కాంగ్రెస్కు చెందిన ఇతర సీనియర్ అధికారులతోనూ ఆయన భేటీ కానున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ డేవిడ్ హేలే, ఆయుధాల నియంత్రణ-అంతర్జాతీయ భద్రత అండర్ సెక్రటరీ థాంప్సస్లతో సమావేశమవుతారు.













