అంతరిక్షంలో హోటల్?
అంతరిక్షంలో హోటల్? భలే బాగుందే ఐడియా. అంతరిక్షంలో తొలి హోటల్ ఏర్పాటుకు అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన ఓరియన్ స్పాన్ హోప్ప్ సంస్థ భారీ కసరత్తు చేస్తున్నది. 2012 చివరికల్లా అంతరిక్షంలో తొలి లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. 35/ 14 అడుగుల విస్తీర్ణంతో ఏర్పాటు చేస్తున్న ఈ హోటల్‌కు అరోరా స్టేషన్ అని పేరు పెట్టారు. ఈ హోటల్లో నలుగురు అతిథులు, ఇద్దరు సిబ్బంది ఉండే అవకాశముంటుంది. ఒకసారి అలా వెళ్లినవారు అంతరిక్ష హోటల్లో ఏకంగా 12 రోజుల పాటు ఉంటారు. అందుకు ప్రయాణికులు భారీగానే చెల్లించాల్సి ఉంది. ఒక వ్యక్తి 95 లక్షల డాలర్లు ( భారత కరెన్సీలో సుమారు రూ.61 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది.













