పార్శిల్ బాంబుల అమనుమానితుడు అరెస్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శకులను లక్ష్యంగా చేసుకుని పార్శిల్ బాంబులను పంపుతున్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. ఫ్లోరిడాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నిరో, ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్కు ఇటీవల వరుసగా అనుమానిత బాంబు పార్శిళ్లు వచ్చాయి. బాంబుల సంఘటనను దురదృష్టకర సంఘటనగా ట్రంప్ వర్ణించగా, ఇందులో రాజకీయ కుట్ర ఉందని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.













