మాతృభాష మరవకండి : వెంకయ్యనాయుడు
అమెరికాలో ఉన్న భారతీయులందరూ ఏ రాష్ట్రం నుండి వచ్చినప్పటికీ వారి మాతృభాష, సంస్కతులను గుర్తుంచుకుని కాపాడుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. చికాగోలోని(ప్లెయిన్‌ఫీల్డ్) కమ్యూనిటీ క్రిస్టియన్ చర్చిలో సెప్టెంబర్ 8వ తేదీన ప్రవాస భారతీయ, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను ఉప-రాష్ట్రపతి హోదాలో చికాగోకు ఆహ్వానించినప్పుడు వివేకానందుడి ప్రసంగం స్పురణకు వచ్చిందని, ఉప-రాష్ట్రపతిగానే గాక ఓ భారతీయుడిగా వివేకానందుడిని స్మరించుకుని తాను గర్వపడుతున్నానని వెంకయ్య పేర్కొన్నారు. అనంతరం ఆయనను పలువురు తెలుగువారు, ఇతర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తోపాటు పలు తెలుగు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.













