వారితో కలిసి పనిచేయలేం
గూగుల్ ఉద్యోగులు రోడెక్కారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులతో ఎట్టిపరిస్థితుల్లో కలిసిపనిచేయబోమని ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు 600 మంది ఉద్యోగులు తమ సంతకాలతో కూడిన పిటిషన్‌ను ఉన్నతాధికారులకు అందజేశారు. యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)తో కలిసి క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఒప్పందం చేసుకోవద్దని గూగుల్ ఉన్నతాధికారులను కోరారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో గూగుల్ ప్రముఖ సంస్థగా ఉండగా.. మార్కెట్లో గూగుల్ ప్రత్యర్థులుగా అమెజాన్, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలందిస్తున్నాయి. తాజాగా క్లౌడ్ కంప్యూటింగ్ విషయంలో సీబీపీతో కలిసి పనిచేయాల్సి రాగా…గూగుల్ ఉద్యోగులు అందుకు ససేమీరా అంటున్నారు. మానమ హక్కులను లెక్కచేయకుండా, వసలదారులను చిన్నచూపు చూసే సీబీపీ లతో పనిచేయడం తమకు ఇష్టం లేదని ఉన్నతాధికారులకు పిటిషన్ పెట్టుకున్నారు.













