లాక్డౌన్ ఎత్తివేయడానికి 4 నిబంధనలు
ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల్లోనూ, అమెరికాలోని అన్నీ రాష్ట్రాలను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న ఈ లాక్ డౌన్ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగించాలి? అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ తీసేయమని ప్రజలు అధికారుల ఇంటిముందు ధర్నాలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. లాక్ డౌన్ పొడిగిస్తే వైరస్ కట్టడి అవుతుంది. కాని ఎకానమీ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు అందరూ ఆలోచిస్తున్న విషయం ఇదే.
ఈ తరుణంలో అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ లాక్ డౌన్ తీసేయాలంటే నాలుగు నిబంధనలు సూచించింది.
- రాష్ట్రంలో కరోనా పేషంట్స్ను చేర్చుకోవడానికి అవసరమైన ఆసుపత్రులు ఉన్నాయా?
- రాష్ట్రంలో కరోనా సోకింది అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా?
- కరోనా బాధితులను మానిటర్ చేసుకుంటూ, వారి సంఖ్య పెరగకుండా చూడగలిగే సదుపాయాలు ఉన్నాయా?
- గడిచిన 14 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య పెరగకుండా ఉందా?
వీటికి సరైన జవాబులు దొరికినప్పుడే లాక్ డౌన్ ఎత్తివేతపై ఆలోచించవచ్చని సూచించింది.













