హాలోవీన్ ప్లిలలతో సరదాగా ట్రంప్
హాలోవీన్ వచ్చేస్తున్నది. అయితే దానికంటే ముందే వైట్‌హౌజ్‌లో ఆ సందడి మొదలైంది. అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాలోవీన్ డ్రెస్సుల్లో వచ్చిన చిన్నారులతో సరదాగా గడిపారు. వైట్‌హౌజ్ రిపోర్టర్ల పిల్లలు ఈ పోటోషూట్ ఈవెంట్లో పాల్గొన్నారు. రకరకాల ఆకారాలు, భూతాల వేషంలో పిల్లలు, ట్రంప్‌ను ఆకట్టుకున్నారు. వెరైటీ కాస్ట్యూమ్‌లతో వచ్చిన ఈ పిల్లలను ఉద్దేశించి ఫన్నీ కామెంట్స్ చేశారు ట్రంప్. ఓ ఆ డ్రెస్ చాలా భయపెడుతున్నదంటూ ట్రంప్ పిల్లల్ని థ్రిల్ చేశారు. తన మాటలతో వారిని ఆట పట్టించారు. ఇక మీడియాను కూడా తనదైన స్టయిల్లో మెచ్చుకున్నారు. మీడియా మిత్రులకు ఇంత మంచి పిల్లలు ఉన్నారా నమ్మలేకపోతున్నా చాలా అందమైన పిల్లల్ని కన్నారంటూ ట్రంప్ రిపోర్టర్లకు విషెస్ చెప్పారు. మీ పేరెంట్స్ లాగే మీరు కావాలని ఆ పిల్లలకు ఉద్బోద చేశారు. నన్ను చూసినట్టే మీడియా మిమ్ములిన చూస్తున్నదా మీడియా మిమ్మల్ని బాగుచూస్తుందనుకుంటా అని ట్రంప్ వెరైటీ కామెంట్ చేశారు. ఇక ఆ తర్వాత ట్రంప్ ఇచ్చిన చాక్లెట్లను ఎంజాయ్ చేశారు ఆ పిల్లలు, అప్పుడు కూడా ఓ చురక వేశారాయన. ఈ చాక్లెట్లతో బరువు పెరగరనుకుంటా అని చమత్కరించారు. ట్రంప్ మాటలతో సంబంధం లేకుండా పిల్లలు ఆ మూమెంట్స్‌ను తెగ ఎంజాయ్ చేశారు.













