భారత్ ఆహ్వానాన్ని తిరస్కరించిన అమెరికా అధ్యక్షుడు
రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావాలన్న భారత్ ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు సమాచారం. ఇటీవల భారత్, రష్యా మధ్య జరిగిన డీల్ కారణంగా అసంతృప్తితో ఉన్న ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అటు అమెరికా, ఇటు భారత్ దౌత్య వర్గాలు అధికారికంగా స్పందించలేదు. ఈ సమాచారంపై వ్యాఖ్యానించేందుకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది నిరాకరించారు. అమెరికా అధ్యక్షుడి పర్యటన వివరాలపై వైట్‌హౌస్ మాత్రమే వ్యాఖ్యానించగలదని పేర్కొన్నారు. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ అమెరికాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆ ఆహ్వానానికి ఇంకా సమయం ఉంది. దానిపై ఇప్పుడే తుది నిర్ణయం తీసకున్నారని అనుకోను అని అన్నారు.













