మార్పులు చేస్తే పారిస్ ఒప్పందంపై సంతకం
పారిస్ వాతావరణ ఒప్పందంలో తమకు ప్రయోజనాలు చేకూరేలా మార్పులు చేస్తే తన నిర్ణయం మార్చుకునేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్వవస్థకు చేటుచేస్తుందని, దీని నుంచి బయటకు వచ్చేస్తున్నామని గత ఏడాది జూన్లో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదివరకటి అధ్యక్షుడు ఒబామా హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై బ్రిటన్కు చెందిన ప్రముఖ టీవీ ఛానెల్ ముఖాముఖిలో ట్రంప్ మాట్లాడారు. మార్పులు చేస్తే పారిస్ ఒప్పందంపై సంతకం పెట్టడానికి సిద్ధమేనని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం ఒప్పందం విధ్వంసకరమైనదని వ్యాఖ్యానించారు.













