మరోసారి కిమ్, ట్రంప్ భేటీ
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో త్వరలో భేటీ కానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, ఇరు దేశాల మధ్య చర్చలు, ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయన్న విషయంలో మాత్రం ఆయన సృష్టతనివ్వలేదు. అణ్వస్త్ర నిరాయుధీకరణ అంశంపై కిమ్ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. మూడోసారి గత వారంలో మూన్, కిమ్‌తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడితో మరోసారి సమావేశమవాలని తాను ఆశిస్తున్నట్టు కిమ్ నుంచే సందేశాన్ని ట్రంప్‌కు అందజేసినట్టు మూన్ తెలిపారు.













