ఉత్తర కొరియాతో చర్చలకూ తాను సిద్ధమే
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చలకూ తాను సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. చర్చలను నేను అన్నివేళలా నమ్ముతాను. అవకాశం వస్తే కిమ్‌జాంగ్‌తో చర్చల్లో తప్పకుండా పాల్గొంటాను. ఈ విషయంలో నాకు ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఎలాంటి చర్చలైనా షరతులతోనే నడుస్తాయి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ షరతులేంటో మాత్రం చెప్పలేదు. రెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య అధికారిక చర్చలు మొదలుకానున్నాయి. దక్షిణ కొరియాలో శీతకాల ఒలింపిక్స్ నిర్వహణలో తోడ్పాటుపై రెండు దేశాల ప్రతినిధులు ప్రముఖంగా దృష్టి సారించనున్నారు.













