నోబెల్ వద్దు…నాకు ప్రపంచాన్ని జయించాలనే కోరిక
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఉందని, అదే నాకు గొప్ప బహుమతి అవుతుందని మనసులోని మాటను వెల్లడించారు. మీరు నోబెల్ శాంతి బహుమతికి అర్హులేనని భావిస్తున్నారా అని ఓ విలేకరి అడిగి ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, ప్రతి ఒక్కరికి బహుమతి పొందాలని ఉంటుంది. ఎవరూ కూడా మాకు వద్దు అని చెప్పరు. నాకు మాత్రం ఆసక్తి లేదు. నా కోరిక ఏంటంటే, ప్రపంచాన్ని జయించాలి. అదే నాకు పెద్ద బహుమతి. మనం ప్రపంచం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. అందుకే నాకు ప్రపంచ విజయాన్ని బహుమతిగా తీసుకోవాలని ఉందని పేర్కొన్నారు.













