చైనా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది
చైనా తీరు పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే క్షిపణి పరీక్షలతో హడలెత్తిన్న ఉత్తర కొరియాకు ఇంధనం అమ్ముతున్న చైనాను ట్రంప్ తప్పుపట్టారు. చైనా వైఖరి తనను నిరుత్సాహాపరిచిందన్నారు. ఈ అంశాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఉత్తర కొరియాకు ఆయిల్ అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా చైనా దొరికిపోయిందని ట్రంప్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. చైనా నౌకలు ఉత్తర కొరియాకు ఇంధనం సరఫరా చేస్తున్న శాటిలైట్ ఇమేజ్‌లు అమెరికా గుర్తించిందన్నారు. ఒకవేళ చైనా ఇలాగే వ్యవహరిస్తే, నార్త్ కొరియా సమస్యకు స్నేహపూర్వక పరిష్కారం దొరకదన్నారు.













