ఏం జరుగుతుందో చూద్దాం
అణ్వాయుధాలను త్యజిచాలంటూ తమపై ఏకపక్షంగా ఒత్తిడి చేస్తే అమెరికాతో ప్రతిపాదిత చర్చలను రద్దు చేసుకుంటామంటూ ఉత్తర కొరియా చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచితూచి స్పందించారు. కిమ్ జోంగ్ ఉన్‌తో తన భేటీ రద్దుకు సంబంధించి ప్రస్తుతానికైతే ఉత్తర కొరియా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని, ఏం జరుగుతుందో వేచి చూద్దామని ఆయన అన్నారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్రరహితంగా మార్చాలంటూ ఇప్పటికీ ఒత్తిడి చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, అవును అని ట్రంప్ సమాధానమిచ్చారు.
వచ్చే నెల 12న సింగపూర్‌లో ట్రంప్, కిమ్ భేటీ కావాల్సి ఉంది. అక్రమ వలసదారులపై ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ ఆమెరికా వలస చట్టాలు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనవని పేర్కొన్నారు.













