డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన ఎప్పుడు ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాలు లేవని తెలుస్తోంది. తొలుత ఆయన ముఖ్య అతిథిగా వస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటి వరకు వైట్ హౌస్ నుంచి ట్రంప్ భారత పర్యటనపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడకపోవడంతో ఇండియాకు వెళ్లేందుకు ఆయన నిరాసక్తంగా ఉన్నారని తెలుస్తోంది. భారత్, అమెరికా సంబంధాలు మరింత పటిష్ఠపరచడంలో భాగంగా ట్రంప్ ఇండియా పర్యటన ఉంటుందని, భారత్లో పర్యటించేందుకు ట్రంప్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ రీజియన్ అధికారి వెలిస్ వెల్స్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియాలో ట్రంప్ పర్యటన ఎప్పుడు ఉండవచ్చనే అంశంపై మరిన్ని వివరాలు తన దగ్గర లేవని ఆమె వెల్లడిచారు. ఆయన వ్యాఖ్యల తరువాతే గణతంత్ర వేడులకకు ట్రంప్ వస్తారని అందరూ భావించారు. అయితే, ఈ మధ్య కాలంలో భారత్లో సంబంధాల గురించి ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో, రిపబ్లిక్ డే సందర్భంగా కాకపోయినా, త్వరలోనే ఆయన ఇండియాలో పర్యటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













