ట్రంప్ ను తట్టుకుని నాటో నిలబడగలదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నాటో మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. సైనిక నిర్వహణ కోసం నాటో సభ్యదేశాల నుంచి అధిక మొత్తంలో రాబట్టాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అయితే, పలు దేశాలు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఏకపక్ష నిర్ణయాల పట్ల నాటో మిత్రదేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నాటో కూటమిలో కొనసాగాలా? వద్దా? అంటూ పలు దేశాలు వ్యూహరచనలు చేస్తున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో నాటో భవిష్యత్తు ప్రశ్నార్థాకంగా మారే ప్రమాదముంది.













