అమెరికాకు తొలి జాత్యాహంకార అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు తొలి జాత్యాహంకార అధ్యక్షుడు అని డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సర్వీసెస్ ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ నిర్వహించిన సమావేశంలో బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జాత్యాహంకారాన్ని ట్రంప్ వ్యాప్తి చేస్తున్నాడని పేర్కొన్నారు. వ్యక్తుల యొక్క రంగు, జాతీ, వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశాల ఆధారంగా వ్యక్తులతో ట్రంప్ వ్యహరిస్తాడని, ఇది పూర్తిగా అనారోగ్యం అని బిడెన్ తెలిపారు. రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలకు చెందిన ఏ అధ్యక్షుడు కూడా ఇలా వ్యవహరించలేదని అన్నారు. కరోనా వైరస్ను సక్రమంగా ఎదుర్కొలేకపోయిన ట్రంప్, ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ చీలికలు తెస్తున్నాడని విమర్శించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే తొలి 100 రోజుల్లోనే సంస్థాగత జాత్యహంకారాన్ని పరిష్కరించడం ప్రారంభిస్తానని బిడెన్ ప్రతిజ్ఞ చేశారు.













