ప్రెసిడెంట్ తో మాట్లాడిన ఫేక్ కాలర్
నమ్మకం కలగడం లేదా. ఓ ప్రాంక్ కాలర్ ప్రెసిడెంట్ ట్రంప్‌తో మాట్లాడారు. అది కూడా అమెరికా అధ్యక్షుడు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తుంటే ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూజెర్సీ సేనేటర్ బాబ్ రాబర్ట్ మెనెన్‌డేజ్ పేరుతో కమీడియన్ జాన్ మెలెండెజ్ తన ఫోన్లో ట్రంప్‌తో మాట్లాడారు. నాలుగు నిమిషాల పాటు ఆ కమీడియన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ ప్రయాణిస్తున్న సమయంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దస్టటరింగ్ జాన్ పోడ్‌క్యాస్ట్ టీవీ షోలోనూ ట్రంప్‌తో మాట్లాడిన ఫోన్ రికార్డ్‌ను ప్రసారం చేశారు. ఆ రికార్డ్‌లో ట్రంప్ గొంతు సృష్టంగా వినిపించింది. వలస విధానంపై ఇద్దరు కాసేపు ముచ్చటించారు. ప్రాంక్ కాలర్ మెలెండెజ్ మొదట ఇద్దరు వైట్‌హౌస్ ఆపరేటర్స్‌తో మాట్లాడారు. ఆ తర్వాత జేర్డ్ కుష్నర్తోనూ ముచ్చటించారు. ఆ తర్వాతే ఎయిర్‌ఫోన్స్ వన్ నుంచి కమీడియన్కు కాల్ వచ్చింది. దీనిపై స్పందించేందుకు వైట్‌హౌజ్ ప్రతినిధులు నిరాకరించారు.













