గత అధ్యక్షుల కంటే నా పాలనే భేష్
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం 500 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇదే కాల పరిమితిలో గత అధ్యక్షులు సాధించినదాంతో పోలిస్తే, తానే ఎక్కువ కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు. తన నాయకత్వంలో మునుపెన్నడూ లేనంత ఉత్తమ ఆర్థిక వ్వవస్థగా అమెరికా నిలిచిందన్నారు. కెనడా సహా ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే ఇనుము, అల్యూమినియంపై రుసుములను విధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ గత అధ్యక్షుల కంటే నేను ఎక్కువగా పనిచేసినట్లు చాలామంది నమ్ముతున్నారు. పన్నుల సంస్కరణ, సైనికదళాల బలోపేతం, నేరాల అదుపు, అక్రమ వలసలకు అడ్డుకట్ట, కట్టుదిట్టమైన సరిహద్దులు, ఉత్తమ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన ఇంకా ఎన్నోన్నె చేశాం అని ఆయన చెప్పుకొచ్చారు.













