ఇలాంటి సస్పెన్షన్ ను ఊహించలేకపోయా : రాహుల్ గాంధీ
లోక్సభలో తనపై అనర్హత వేటు పడుతుందన్న విషయాన్ని రాజకీయాల్లో చేరినప్పుడు ఊహించలేకపోయానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులతో, భారత సంతతి విద్యావేత్తలతో ముచ్చటించారు. కిక్కిరిసిసన ఆడిటోరియంలో వారి ప్రశ్నలకు సమాధానమించ్చారు. మోదీ అనే ఇంటిపేరున్న వారికి సంబంధించి చేసిన వ్యాఖ్యపై శిక్ష నేపథ్యంలో ఎంపీగా రాహుల్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 2000 సంవత్సరంలో రాజకీయాల్లో నేను అడుగుపెట్టినప్పుడు ఇప్పటి పరిణామాలను ఏమాత్రం ఊహించలేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే భావించలేదు. తర్వాత మాత్రం ప్రజలకు సేవ చేసేందుకు నాకిదో మహత్తర అవకాశమని భావించాను. నాకు రావాల్సినదానికంటే పెద్ద అవకాశమే ఇది. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి అని రాహుల్ తెలిపారు.













