DTC: సుమారు 28 వేలమంది ఆకలి తీర్చడానికి సహాయం చేసిన డీటీసీ
డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ (DTC) ఆధ్వర్యంలో మిచిగాన్‌లోని ఓక్ పార్క్‌లోని ఫర్గాటెన్ హార్వెస్ట్‌లో వాలంటీర్ కార్యక్రమమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వీరంతా కలిసి 6994 పౌండ్ల ఆహార పదార్థాలను ప్యాక్ చేశారు. ఈ ఆహారం సుమారు 27,976 మంది అన్నార్తులకు ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో సేవలందించిన వాలంటీర్లకు డీటీసీ (DTC) ప్రెసిడెంట్ శ్రీధర్ అయిత ధన్యవాదాలు తెలియజేశారు. వాలంటీర్ల సమయాన్ని, కృషిని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి 20 మంది వాలంటీర్లను తీసుకొచ్చిన సేవ/సర్వీసెస్ కమిటీని శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. ఫర్గాటెన్ హార్వెస్ట్ సంస్థ ఆహార పదార్థాల వృధాను నిలువరించడానికి, అందరి ఆకలి తీర్చడానికి కృషి చేసే సంస్థ. ఈ సంస్థతో కలిసి డీటీసీ (DTC) ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.








