పెరిగిన కరోనా కేసులు…వణకుతున్న ప్రపంచం
ప్రపంచంలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా 201 దేశాల్లో అడుగుపెట్టగా.. ఇప్పటి వరకు కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 8లక్షలు దాటింది. స్పెయిన్, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో అమెరికాలో 3వేలకు పైగా మరణించగా.. స్పెయిన్లో 8వేలకు పైగా చనిపోయారు. గడచిని 24 గంటల్లో ఒక్క స్పెయిన్లోనే 800కేసులు నమోదయ్యాయి. వైరస్ విస్తరిస్తున్న దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో కరోనా బాధితుల సంఖ్య 8లక్షలకు చేరింది.













