15 లక్షలు దాటిన కరోనా కేసులు
కరోనా మహమ్మారి విశ్వరూపాన్ని అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ సిఎస్ఎస్ఈ విభాగం తాజాగా మరోసారి ఆవిష్కరించింది. ఈ విభాగం తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 15,02,618 నమోదు కాగా, 89,915 మంది మృత్యువాత పడ్డారని, మరో 3,08,000 మంది ఈ ఇన్పెక్షన్ బారి నుండి కోలుకున్నారని తెలుస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న అమెరికాలో బుధవారం తాజాగా నమోదయిన 19 కేసులతో ఇప్పటి వరకు నమోదయిన కేసుల సంఖ్య 4,01,116కు చేరింది. కరోనా ఇన్ఫెక్షన్ బారినపడిన దేశ్యాప్తంగా 15,732 మంది మరణించినట్లు సిఎస్ఎస్ఇ లెక్కల ద్వారా తెలుస్తోంది. ఎక్కువగా న్యూయార్క్ రాష్ట్రంలో 1,40,386 కేసులు నమోదయ్యాయి.













