ఐఎంఎఫ్‌కు లగార్డే గుడ్‌బై
ఫ్రెంచ్ రాజకీయవేత్తగా మారిన క్రిస్టన్ లగార్డే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజీనామా సెప్టెంబర్ 12 నుంచి అమలులోకి రానున్నది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆమెను నియమిస్తూ యూరోపియన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడంతో ఈ పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె రాజీనామాను ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది కూడా. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులను కలుసుకొని తన రాజీనామాను సమర్పించినట్లు ఒక ప్రకనటలో ఆమె వెల్లడించారు. దీంతో డేవిడ్ లిప్టన్ నూతన ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.













