వీఘర్ ముస్లింలకు మద్దతుగా అమెరికాలో బిల్లు
వీఘర్ ముస్లిం మైనార్టీలను చైనా ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తూ అమెరికా ప్రతినిధుల సభ (దిగువ సభ) బిల్లును ఆమోదించింది. వీఘర్ మానవ హక్కుల విధానం చట్టం-2019 పేరుతో రూపొందించిన ఈ బిల్లుపై చర్చ జరిపింది. ఎగువసభ అయిన సెనేట్ ఇంతకుముందే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా ప్రభుత్వం జింగ్యాంగ్ రాష్ట్రంలోని దాదాపు పది లక్షల మంది వీఘర్ ముస్లింలను సామూహికంగా నిర్బంధ కేంద్రాల్లో పెట్టింది. అమెరికా బిల్లును చైనా తీవ్రంగా ఖండించింది. వీఘర్ ముస్లింలను నిర్బంధించలేదని, వారికి వృత్తి విద్యలో శిక్షణ ఇస్తున్నామని తెలిపింది.













