Miss India USA: మిస్ ఇండియా యూఎస్ఏ 2024 కిరీటం అందుకున్న కైట్లిన్ సాండ్రా నీల్
చెన్నైకి చెందిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ కైట్లిన్ సాండ్రా నీల్ అరుదైన ఘనత సాధించారు. న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎస్ఏ 2024 (Miss India USA) కిరీటం అందుకున్నారు. 19 ఏళ్ల సాండ్రా.. యూనివర్సిటీ ఆఫ్ కాలిపోర్నియాలో చదువుకుంటున్నారు. ‘నేను నా కమ్యూనిటీని పాజిటివ్‌గా ప్రభావితం చేయాలని అనుకున్నా. అలాగే మహిళా సాధికారకత, చదువుపై ఫోకస్ పెట్టాలనేదే నా లక్ష్యం’ అని సాండ్రా చెప్పారు. చెన్నైలో పుట్టిన ఆమె.. గత 14 ఏళ్లుగా యూఎస్ఏలో ఉంటున్నారు. భవిష్యత్తులో వెబ్ డిజైనర్ కోర్సు చేయాలనుకుంటున్నానన్న ఆమె.. మోడలింగ్, యాక్టింగ్‌లో కెరీర్ నిర్మించుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.
అలాగే ఇల్లినాయిస్కు చెందిన సంస్కృతి శర్మ.. మిసెస్ ఇండియా యూఎస్ఏ అవార్డు అందుకున్నారు. మిస్ టీన్ఇండియా యూఎస్ఏ పీజెంట్గా వాషింగ్టన్కు చెందిన అర్షిత కాత్పాలియా అవార్డు అందుకున్నారు. ఈ పోటీల్లో 25 స్టేట్స్కు చెందిన 47 మంది పోటీదారులు ఈ అందాల పోటీల్లో పాల్గొన్నారు. 2023లో మిస్ ఇండియా (Miss India USA) అవార్డు అందుకున్న రిజుల్ మైనీ, మిసెస్ ఇండియాగా ఎన్నికైన స్నేహ నంబియార్.. ఈ ఏడాది విన్నర్లకు కిరీటాలు అందజేశారు.







