లాస్ ఏంజెల్స్ లో అదిపెద్ద ఆటో షో
అమెరికాలోని కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో షో ప్రారంభమైంది. నవంబరు 30 నుంచి డిసెంబరు 9 మధ్య దిగ్గజ వాహన కంపెనీలు తమతమ వాహానాలను ప్రదర్శించనున్నాయి. అంతేకాదు వెయ్యి వరకు కార్లు ఈ ఆటో షోలో లాంచ్ చేయనున్నారు. బిఎండబ్ల్యు, వోల్వో, మెర్సిడెస్ బెంజ్, పోర్షే, వోక్స్వ్యాగన్ ఆడి, ల్యాండోరోవర్ జాగ్వార్, ఫోర్డ్, టయోటా, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీల లగ్జరీ, పాసింజర్, ఎస్యువి వాహనాలను ఆవిష్కరించి కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా జీప్ తన మొదటి ట్రక్ గ్లాడియేటర్‌ను ఈ ఆటో షోలో ప్రవేశపెట్టింది.













