బోయింగ్ లో భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా విమానయాన రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ సుమారు 12వేల మందిని తొలగించేందుకు నిర్ణయించింది. రాబోయే కొద్ది నెలల్లో అనేక వేల ఉద్యోగాలను తొలగించనున్నామని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. అయితే ఎంతమంది అనేది సృష్టంగా పేర్కొనలేదు. కోవిడ్ 19 మహమ్మారి వైమానిక పరిశ్రమను ఘోరంగా దెబ్బతీసిందని, దీంతో రాబోయే కొన్నేళ్లలో వాణిజ్య జెట్ల తయారీని బాగా తగ్గించనున్నామని బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ ఉద్యోగులకు అందించిన సమాచారంలో తెలిపారు. 6770 అమెరికా ఉద్యోగులను ఈ వారంలో తొలగిస్తామనీ, మరో 5,520 మంది స్వచ్ఛందంగా సంస్థను వీడడానికి అంగీకరించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకుంటామని డేవిడ్ చెప్పారు. అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు.













