భారతీయుడి చేతికి ఎఫ్-15 ప్రాజెక్టు
బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్-15 యుద్ధవిమానాల ప్రాజెక్టు పగ్గాలు ఓ భారతీయుడి చేతికి అందాయి. ఈ విషయాన్ని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్థి ప్రత్యూష్ కుమార్ అమెరికాలో ఎఫ్-15 ప్రాజెక్టుకు నేతృత్వం వహించనున్నారు. ఆయన 1989లో ఢిల్లీ ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజీనిరింగ్ పూర్తి చేశారు. అనంతరం మాస్చాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్డీ అందుకొన్నారు. ప్రత్యూష్ కుమార్ అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్-15 వ్యాపార వ్యవహారాలు చూసుకుంటారని బోయింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.













