జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ… పలు కీలక ఒప్పందాలు
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన యోగా డేలో పాల్గొన్న మోదీ తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. వైట్ హౌస్‌కి చేరుకున్న మోదీకి జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాల అధిపతులు భారత్, అమెరికా రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. రక్షణ సహకారంలో భాగంగా స్ట్రెకర్ సాయుధ వాహనం, హోమిట్టర్లు, ఎంక్యూ`9 రీపర్ డ్రోన్లు, జిఈ`ఎఫ్ 414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ల తయారీకి సాంకేతికత సహకారం వంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం అతి ముఖ్యమైనదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడిరచారు. దీనితో పాటు భారత్‌లో 2.7 బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్ కోసం మైక్రోన్‌తో ఒప్పందం, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) వంటి పలు కీలక అంశాలపై ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు.













