సైంటిఫిక్ ప్రపంచ సుందరి బెల్లా హదీద్
23 ఏళ్ల వయసున్న సూపర్ మోడల్ బెల్లా హదీద్ ఈ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అని గ్రీక్ గణితశాస్త్రం చెబుతోంది. అందమైన మహిళలు ఎవరో తేల్చేందుకు గోల్డెన్ రేసియో ఆఫ్ బ్యూటీఫ్లై స్టాండర్డ్స్ ఫార్ములాను గ్రీక్ స్కాలర్లు రూపొందించారు. ముఖ భాగాల కొలతను తీసుకుని అందాన్ని లెక్కించారు. క్లాసిక్ గ్రీక్ గణాంకాలను అనుగుణంగా అందాన్ని నిర్వహించిన ఈ ఫార్ములాకు బెల్లా హదీద్ ముఖం కొలతలు 94.35 శాతం సరిపోయాయి. ఇదే ఫార్ములా ప్రకారం పాప్ సింగర్ బెయోన్స్ రెండవ స్థానంలో నిలిచింది. ఆమె ముఖం 92.44 శాతం మేర సరితూగింది. మూడవ స్థానంలో నటి అంబెర్ హీయర్డ్ నిలిచింది. ఆమె ముఖం 91.58 శాతం సూత్రానికి అనుగుణంగా సరిపోలింది. గోల్డెన్ రేసియా ఆఫ్ బ్యూటీ ఫ్లై సాండర్డ్స్ ప్రకారం విక్టోరియా సీక్రెట్ మోడళ్ల ముఖాలు అధికంగా సరితూగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.













