డొనాల్డ్ ట్రంప్ మాస్క్‌లో వచ్చి ఏటీఎం దోపిడీ
అమెరికాలో హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఓ ఏటీఎం దోపిడి జరిగింది. నార్త్ ఇటలీలోని పీడ్మంట్ రాజధాని టురిన్లో దుండగులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కులు ధరించి దోపిడికి పాల్పడ్డారు. మాస్కులు ధరించి ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు ఏటీఎం మెషిన్ లో బాంబు పెట్టి పేల్చారు. అనంతరం డబ్బులు తీసుకొని పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 1991లో వచ్చిన హాలీవుడ్ మూవీ పాయింట్ బ్రేక్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని దోపిడీకి పాల్పడినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటన ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో వైరల్‌గా మారింది.













