Dallas: డల్లాస్ లో విద్యార్థి మృతిపై ఆటా దిగ్భ్రాంతి

డల్లాస్ లో అక్టోబర్ 3 వ తారీఖున హైదరాబాద్ కి చెందిన చంద్రశేఖర్ పోలె అనే మాస్టర్స్ స్టూడెంట్ దుర్మరణం చెందటం తమను ఎంతో దిగ్బ్రాంతికి గురి చేసిందని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలియచేసింది. డెంటల్ సర్జరీ స్టూడెంట్ అయిన చంద్రశేఖర్, పార్ట్ టైమ్ జాబ్ లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఒక గుర్తు తెలియని దుండగుని తూటాలకు బలైపోయారు. ఇది ఒక పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ స్టూడెంట్ కమ్యూనిటీ ఇటువంటి సందర్భాలలో ఎంతో జాగురకతతో వ్యవహరించవలిసిందిగా ఆటా విజ్ఞప్తి చేసింది. ఆఫ్ క్యాంపస్ లో జాబ్స్ చేసే విషయంలో స్టూడెంట్స్ పునరాలోచించుకోవలిసిందిగా కోరింది.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ: ‘‘అమెరికాలో గన్ సంస్కృతి ఆందోళనకర స్థాయికి చేరింది. ఇటీవలి కాలంలో అనేక మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కాల్పులకు బలవుతున్నారు. కనీసం ఇకనైనా అమెరికన్ ప్రభుత్వం గన్ సంస్కృతి మీద గట్టి చర్యలు తీసుకోవాలి’’ అని సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులను కోరారు.
అదే సందర్భంలో ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ: ‘‘చంద్రశేఖర్ గారి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి’’ అని తెలిపారు.