లాస్ ఏంజిల్స్ లో ఆటా 16వ మహాసభలు మరియు నిధుల సేకరణ
ఆటా తన 2020 కాన్ఫరెన్స్ కిక్-ఆఫ్ గాలా డిన్నర్ సెప్టెంబర్ 28, శనివారం రోజు లాస్ ఏంజిల్స్ లోని ఇర్విన్‌లో నిర్వహించింది. ఈ సాంప్రదాయ కిక్ ఆఫ్ డిన్నర్లో సుమారు ఒక మిలియన్ డాలర్లు సేకరించారు. కిక్-ఆఫ్ గాలా డిన్నర్ లో దేశవ్యాప్తంగా వచ్చిన వారితో పాటు స్థానిక తెలుగు సంఘ నాయకులు మరియు ఇతర మద్దతు దారులతో కలిసి దాదాపు మూడు వందల మంది హాజరయ్యారు.
16 వ ఆటా మహాసభలను వచ్చే సంవత్సరం జూలై 3వ తేది నుండి 5వ తేది వరకు హాలీవుడ్, డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్ కు నిలయమైన లాస్ ఏంజిల్స్ లోని అనాహైమ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తామని అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి తెలిపారు.
ఇంతకు పూర్వం ఆటా మహాసభలు లాస్ ఏంజిల్స్‌లో జూలై 2006 లో జరిగింది, 14 సంవత్సరాల తరువాత మల్లి లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్నదాని పట్ల స్థానిక తెలుగు సమాజంలో ఉత్సాహం ఉరకలేస్తుంది . తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టాస్క్) ఈ సమావేశానికి స్థానిక అతిథిగా వ్యవహరిస్తుంది అదే విధంగా లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రై-వ్యాలీ (టాట్వా) సహకారం అందించాడానికి ముందుకొచ్చారు.
ఆ రోజు ఉదయం ఆటా తన మూడవ బోర్డు సమావేశాన్ని అధ్యక్షుడు పర్మేష్ భీంరెడ్డి నాయకత్వంలో విందాం ఇర్విన్-ఆరెంజ్ కౌంటీలో నిర్వహించింది. ఆటా బోర్డ్ ట్రస్టీలు, సలహాదారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ప్రాంతీయ డైరెక్టర్లు, స్టాండింగ్ కమిటీ చైర్లతో పాటు, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖ తెలుగు ప్రముఖులతో సహా దేశవ్యాప్తంగా దాదాపు 200 కి పైగా పలువురు మద్దతుదారులు బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిసెంబర్ మాసంలో తెలుగు రాష్ట్రాలలో జరగబోయే ఆటా వేడుకల కార్యక్రమాల నిర్వహణ, 16 వ మహాసభల నిర్వహణకు ప్రణాళిక సిద్దాం చేయాడానికి మరియు ఇతర కార్యకలాపాల గురించి చర్చించారు.
అధ్యక్షుడు పర్మేష్ భీంరెడ్డి బోర్డు సభ్యులకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు చేపట్టిన వివిధ సామాజిక సేవలపై , ఇతర కార్యకలాపాలపై మరియు ముందు ముందు చేపట్టపోయే కార్యక్రమలపై సవివరంగా వివరించారు. డిసెంబరు నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆటా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆటా వేడుకలకు ప్రెసిడెంట్-ఎలెక్ట్ భువనేశ్ బూజల చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు.
ఆటా మహాసభలకు ముందు సంవత్సరంలో వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ సమయంలో వివిధ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేయడం ఆటా యొక్క సాంప్రదాయం.
ప్రెసిడెంట్-ఎలెక్ట్ భువనేశ్ బూజల రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబరు లో జరుపబోయే ఆటా కార్యక్రమాల ప్రణాళికపై బోర్డు సభ్యులకు వివరించారు. ఆటా బోర్డు 16 వ మహాసభలకు సారధ్యం వహించేందుకు కన్వీనర్‌గా నర్సింహ ద్యాసాని, కో-కన్వీనర్‌గా విజయ్ తూపల్లి, కోఆర్డినేటర్‌గా రిందా సామ, లోకల్ కోఆర్డినేటర్‌గా బయపా రెడ్డి, కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా వెంకట్రామన మురారీ, కాన్ఫరెన్స్ కో-డైరెక్టర్‌గా కాశప్ప మాధరం, కాన్ఫరెన్స్ కో-డైరెక్టర్‌గా రవీందర్ రెడ్డి కొమ్మెర ను కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్ గా, మల్లిక్ బండాను కో-చైర్‌గా, మల్లిక్ బొంతు ను TASC కోఆర్డినేటర్ గా నియమించారు. బోర్డు సమావేశం తరువాత, 16 వ మహాసభలను నిర్వహించే వెస్ట్ కోస్ట్‌లో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన అనాహైమ్ కన్వెన్షన్ సెంటర్ (ACC) లో పర్యటించారు. ఇది లాస్ ఏంజిల్స్ (LAX) అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 13 మైళ్ళ దూరంలోనే ఉంది. కన్వెన్షన్ సెంటర్ ప్రపంచ ప్రఖ్యాత డిస్నీల్యాండ్ రిసార్ట్ ప్రక్కనే ఉంది, ఇది తెలుగు కుటుంబాలకు వారి పిల్లలను డిస్నీకి తీసుకెళ్లడానికి చాల అనువుగా ఉంది. సమావేశానికి హాజరైన వారికి డిస్నీ డిస్కౌంట్ టిక్కెట్లను ఆటా అందిస్తుంది.
కిక్-ఆఫ్ డిన్నర్ కు హాజరైన అతిథులతో అధ్యక్షుడు పర్మేష్ భీంరెడ్డి మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలా తర్వాత మల్లి లాస్ ఏంజెల్స్ లో జరపడానికి చేసిన కృషిని తెలుపుతూ ఈ మహాసభలను విజయవంతం కావడానికి వారి అన్ని విధాల మద్దతు కావాలని కోరారు. అదేవిధంగా ఈ సమావేశాలకు బంధు మిత్రులతో కలిసి రావాల్సిందిగా అతిథులను ఆహ్వానించారు. కన్వీనర్ నర్సింహ ద్యాసాని, కోఆర్డినేటర్ రిందా సామ ఇప్పటికే ప్రారంభించిన సమావేశానికి సన్నాహాలు ప్రారంభించిన కమిటి సభ్యులను అతిథులకు పరిచయం చేసారు. ఇతర సంస్థలు టిడిఎఫ్, నాటా, నాట్స్, టాటా, తానాతో సహా వివిధ సంస్థల నుండి వచ్చిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటా మహాసభల అమలును పర్యవేక్షించడానికి బోర్డు కమిటీని నియమించింది.
ఈ కమిటీలో పర్మేష్ భీంరెడ్డి-అధ్యక్షుడు, భువనేష్ బూజాలా ప్రెసిడెంట్-ఎలెక్ట్, కరుణకర్ అసిరెడ్డి గత అధ్యక్షుడు, నర్సింహ ధ్యసాని-కన్వీనర్, రిందా సమా-కోఆర్డినేటర్, వేణు సంకినేని-కార్యదర్శి, రవి పట్లోలా-కోశాధికారి, రఘువీర్ రెడ్డి, కృష్ణ ద్యాప, సతీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, మరియు రామ్ అన్నాడి సభ్యులుగా ఉంటారు. అమర్ రెడ్డి మూలమల్లాను అంతర్జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఆటా కార్యవర్గం లాస్ ఏంజిల్స్ బృందానికి ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ గొప్ప ఆతిథ్యం అందించినందుకు మరియు సమావేశాన్ని విజయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. లాస్ ఏంజిల్స్ బృందంలో నర్సింహ ధ్యాసాని-కన్వీనర్, రిందా సామ – సమన్వయకర్త, రవీందర్ రెడ్డి కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్, ప్రాంతీయ సమన్వయకర్త అభినవ్ చిర్రా, రవీందర్ ద్యాప, స్టాండింగ్ కమిటీ చైర్, శ్రీనాథ్ పేరం స్టాండింగ్ కమిటీ కో-చైర్, కుమార్ తాళంకి గత ప్రాంతీయ డైరెక్టర్, ప్రవీణ్ నయని గత ప్రాంతీయ సమన్వయకర్త మరియు వాలంటీర్లు సునీల్ తోకల, నిరంజన్ చలాసాని, నాగరాజ్ గౌడ్, సాగర్ గాదె, అంజన్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ గొప్ప ఆతిథ్యం అందించినందుకు మరియు సమావేశాన్ని విజయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.













