ఆటా కొత్త ట్రస్టీలు వీరే!
అమెరికా తెలుగు సంఘం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జరిగిన ఎన్నికల వివరాలను ఆటా కార్యదర్శి వేణుగోపాలరావు సంకినేని తెలిపారు. లైప్ క్యాటగిరీలో హను తిరుమల్ రెడ్డి, ప్రశీల్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రామ్ అన్నడి, రవీందర్ గూడూరు, రిందా సామ, శరత్ వేముల, సుధీర్ బండారు, విజయ్ భాస్కర్ రెడ్డి తూపల్లి, ప్యాట్రన్ కేటగిరీలో శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి యర్రం రెడ్డి, గ్రాండ్ ప్యాట్రన్ సభ్యులుగా జయంత్ చల్లా, కాశీ విశ్వనాథ్ రెడ్డి, పరశురామ్ పిన్నపురెడ్డి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఆటా సభ్యులను, ఎన్నికైన సభ్యులను ఆటా నాయకులు అభినందించారు.













