కొలంబస్ ఒహాయోలోని లక్ష్మి గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అభివృద్ధి పనులు

చంద్రమోళి శర్మ పార్నంది
తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలో నరమెట్ట అనే గ్రామంలో జన్మించిన చంద్రమోళి శర్మ శ్రీశైలం వేద పాఠశాలలో విద్యను అభ్యసించారు. 8 ఏళ్ల కఠోర శ్రమతో వేదాలు, పూజా విధానాలు క్షుణ్ణంగా నేర్చుకొని 1996లో తన 21వ ఏటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా పెద్దమ్మ గుడిలో పూజారిగా చేరారు. 1996 నుంచి ఇప్పటి వరకు పూజారి నుంచి ప్రధమ పూజారిగా ఎదిగి, గుడి పూరోభివృద్ధికి ప్రత్యక్ష సాక్షిగా, వృద్ధిలో భాగంగా ఉన్నారు. ఇప్పుడు 15 మంది పూజారులున్న ఈ గుడిలో ప్రధమ పూజారిగా ఉన్న చంద్రమోళి శర్మ అంటే చాలా మంది రాజకీయ నాయకులు, సిటీలోని ప్రముఖులకు బాగా తెలుసు.
హైదరాబాద్‌లో జూబిల్లీహిల్స్‌లో ఉన్న పెద్దమ్మ గుడి తెలియనివారు ఉండరు. దుర్గమ్మ వారి అంశగా ఉండి భాగ్యనగరంలో మహంకాళి గుడి తరువాత అంతే పేరున్న గుడి ఇది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ లెక్కల ప్రకారం జంట నగరాలలో భక్తుల కానుకలు, విరాళాలు, పూజలు/ సేవలు, టిక్కెట్ల ద్వారా అత్యధిక రాబడి ఉన్న గుడిగా ఈ పెద్దమ్మ గుడిని పేర్కొంటారు. సంవత్సరంలో దాదాపు రూ. 6 నుంచి 7 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. ఈ గుడి ప్రాశస్త్యం కూడా చాలా గొప్పది. దాదాపు 150 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉందని చెబుతారు. దుర్గమ్మ వారు రాక్షస సంహారం చేశాక, ఈ ప్రాంతంలోని బావి దగ్గర సేద తీర్చుకొని, ఇక్కడే ఉండిపోయారని, ఆ విధంగా వెలసిన పెద్దమ్మవారు శాంత స్వరూపులని, కోరిన కోర్కెలు తీర్చుతారని భక్తుల నమ్మకం. కాంగ్రెస్ నాయకులు పి. జనార్దన రెడ్డి 1993లో ఈ గుడిని మళ్ళి పునర్మించారు. అప్పటి నుంచి ఈ గుడి అభివృద్ధి చెంది రోజుకు 5,000 మంది, శెలవు దినాలలో 20,000 నుంచి 25,000 మంది వరకు, పండుగ దినాలలో 50,000 నుంచి 70,000 మంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ పెద్దమ్మ గుడిలో ప్రధమ పూజారిగా వున్న చంద్రమౌళి శర్మ అమెరికా వచ్చి కొలంబస్ ఒహియో నగరంలో వున్న శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలో చేరిన సందర్భంగా తెలుగు టైమ్స్‌తో మాట్లాడారు.
అమెరికాకు మీరెలా వచ్చారు?
5-6 సంవత్సరాల క్రితం శ్రీ పెద్దమ్మ తల్లిని అమెరికాలోని ప్రజల దగ్గరకు తీసుకువచ్చేందుకు వీలుగా అమెరికాలో ప్రతిష్ఠించాలనే ఆలోచన వచ్చింది. అది దైవ సంకల్పంలాగా, అమ్మవారి అనుగ్రహంలాగా అనిపించి ఆ దిశగా నా ప్రయత్నాలు మొదలుపెట్ట్టాను. మొదట విజిటర్స్ విసా మీద మిల్‌పిటాస్‌లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో, ఆ తరువాత ఇంకొసొరి డల్లాస్ నగరంలో శ్రీ నేంకటేశ్వర స్వామి గుడిలో కొన్నాళ్ళు ఉండి ఇక్కడి స్థితిగతులు, భక్తులు, వారికి కావలసిన పూజలు అన్ని తెలుసుకొన్నాను. ఆ తరువాత ఆ R1 వీసా (Rవశ్రీఱస్త్రఱశీబం జూవశీజూశ్రీవకి ఇచ్చే వీసా కేటగిరీ) ద్వారా వచ్చి పని చేయాలని అనుకొన్నాను. అయితే దైవ నిర్ణయం ప్రకారం అనుకోకుండా కొలంబస్ ఒహాయో నగరంలో ఉన్న శ్రీలక్ష్మి గణపతి దేవాలయము ఫౌండర్ శ్రీ సత్యనారాయణ శాస్త్రి తన వృద్ధాప్యం దృష్ట్యా ఈ గుడిని సవ్యంగా నిర్వహించే వారికి ఇద్దామని అనుకొంటున్నానని, ఆ గుడిని నడిపే బాధ్యతలు స్వీకరించమని అడగడం, అందుకు నేను కొంత మంది స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా, సూచనలతో, మద్దతుతో, ఏర్పాట్లతో ఈ గుడిలో చీఫ్ ప్రీస్ట్ (ప్రధాన పూజారి)గా పూర్తి బాధ్యతలు తీసుకోవటం జరిగింది.
ఇప్పుడు ఏమి చేయనున్నారు?
హైదరాబాద్‌లో ఒక ప్రధానమైన గుడిలో ప్రథమ పూజారిగా, రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ఉద్యోగిగా పూర్తిగా సురక్షితమైన ఉద్యోగం ఉన్న నేను, హైస్కూల్ చదువులలో ఉన్న ఇద్దరు పిల్లలు, ఐటీ ఉద్యోగం చేస్తున్న భార్య (శ్రీమతి సౌజన్య)ల మద్దతుతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను. మొదటగా నేను బాధ్యతలు తీసుకొన్న శ్రీ లక్ష్మి గన్నపాటి దేవాలయం పునర్నిర్మించి, భక్తుల ఆదరణతో అభివృద్ధి చేయాలని, త్వరలోనే ఈ గుడిని నగరంలోని ప్రధాన దేవాలయాలలో ఒకటిగా చేయాలనే సంకల్పంతో ఉన్నాను. అన్ని గదులలో జరిగే నిత్య పూజలు అర్చన, అభిషేకం, కుంకుమ పూజలు, సత్యనారాయణ వ్రతాలు వాటినవి మరింత శ్రద్దతో చేసేయి, భక్తుల ఆదరణ పొందాలి. అలాగే కొన్ని ప్రత్యేకల పూజలు కూడా ప్రారంభించబోతున్నాం. కాలసర్ప దోష పూజ, నవగ్రహ పూజ, రాహు కేతు పూజ, చండి హోమం, ప్రచంగిడ బగళాముఖీ పూజ వంటి పూజలు ఈ మధ్య తెలుగు రాష్ట్రాలలో బాగా ప్రాశస్త్యం పొందాయి. ఆ పూజలు భక్తి శ్రద్దలతో చేసిన వారికి మంచి ఫలితాలు వచ్చాయని తెలిసి అందరూ తమ తమ దోషాలని బట్టి ఆయా పూజలు చేస్తున్నారు. ఆ పూజలను మేము ఇప్పుడు భక్రులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పుడు భక్తులు మా గుడిలోగాని, వారి వారి ఇళ్లలో గాని ఈ పూజలు చేసుకోవచ్చు. వీలుని బట్టి రాబోయే కాలంలో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని మా గుడిలో ప్రతిష్టించి ఆ మహతల్లి దీవెనలు అమెరికాలోని తెలుగువారికి ఇవ్వాలని ధృఢ సంకల్పంతో ఉన్నాను.