కృత్రిమ క్వార్టజ్ కు పన్ను ఊరట
మనదేశం నుంచి కృత్రిమ క్వార్టజ్ పలకలను (క్యూఎస్పీ-క్యార్టజ్ సర్ఫేస్ ప్రోడక్టస్ )అమెరికా ఎగుమతి చేసే సంస్థలకు పన్ను ఊరట లభించింది. ఇందులో పెద్ద సంస్థ అయిన పోకర్ణ ఉత్పత్తులపై అమెరికా అంతర్జాతీయ వర్తక కమిషన్ (యూఎస్ఐటీసీ) భారీ స్థాయిలో ఏడీ (యడ్ వలోరెమ్), సీవీడీ (కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ) రూపంలో యాంటీ -డంపింగ్ డ్యూటీలు విధించింది. తాజాగా పోకర్ణ నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై పన్నుల భారాన్ని యూఎస్ఐటీసీ గణనీయంగా తగ్గించింది. యడ్ వలోరెమ్ డ్యూటీని ప్రస్తుతం 2.67 శాతానికి, సీవీడీని 2.34 శాతానికి తగ్గించారు. ఈ అంశంపై జూన్ 11కి విచారణ పూర్తికావచ్చని, అప్పటికి తుది ఉత్తర్వులు రావచ్చని పోకర్ణ వివరించింది.













