గూగుల్ ను దాటేసిన ఆపిల్
ప్రస్తుత ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన బ్రాండ్‌గా ఆపిల్ నిలిచింది. ప్రముఖ బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్ బ్రాండ్ 2018కి గాను 100 ఉత్తమ గ్లోబల్ బ్రాండ్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో గూగుల్‌ను దాటేసి ఆపిల్ టాప్ స్థానంలోకి వచ్చింది. మూడో స్థానంలో అమెజాన్, నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్, ఐదో స్థానంలో కోకాకోలా నిలిచాయి. కాగా ఆరో స్థానంలో సామ్సంగ్, ఏడో స్థానంలో టొయెటా, 8వ స్థానంలో మెర్సిడజ్ బెంజ్ ఉన్నాయి. కేంబ్రిడ్జ్ ఆనలిటికా వివాదంతో ఫేస్బుక్ బ్రాండ్ విలువ 6 శాతం పడిపోయి, ఈ జాబితాలో ఫేస్బుక్ 9వ స్థానానికి పరిమితమయ్యింది. మెక్‌డొనాల్డ్స్ 10వ స్థానంలో నిలిచింది.













