యాపిల్ సరికొత్త రికార్డు
టెక్నాలజీ దిగ్గజయం యాపిల్ ప్రపంచ తొలి ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్ల కంపెనీగా అవతరించింది. ఇప్పుడు యాపిల్ మార్కెట్ క్యాప్ మొత్తం మెక్సికో ఆర్థిక వ్యవస్థకు సమానం. ట్రిలియన్ డాలర్లు అంటే, అర్జెంటీనా, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర 27 ప్రధాన దేశాల మొత్తం జీడీపీకి సమానం. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.69 లక్షల కోట్లతో సమానం. ఒకప్పుడు దివాళా కోరల్లో చిక్కుకున్న ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ విలువ గల కంపెనీగా నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ గమనాన్ని ఐఫోన్ పూర్తిగా మార్చివేసింది.













