ఆపిల్ కు అరుదైన గుర్తింపు
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఆపిల్ నిలిచింది. న్యూయార్క్ పోస్టు రిపోర్ట్ ప్రకారం దీని మార్కెట్ విలువ 849.2 బిలియన్ డాలర్లు ఉంది. ఇక రెండో స్థానంలో గూగుల్ మాతసంస్థ అల్పాబెట్ 745.1 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. ఇక అమెజాన్ 702.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచింది. గతంలో మూడో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.699.2 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా ఫేస్బుక్ 521.5 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచింది. తొలిసారిగా మైక్రోసాప్ట్ కంపెనీని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అధిగమించింది.













