త్వరలో గూగుల్ ప్లస్ కు నూకలు చెల్లు
గూగుల్ 2011 జూన్ 28న ప్రారంభించిన గూగుల్ ప్లస్‌కు త్వరలో నూకలు చెల్లనున్నాయి. 2015 నుంచి దాదాపు 400 థర్డ్‌పార్టీ యాప్‌లు, గూగుల్ ప్లస్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొడుతూ వచ్చాయని, బాధితుల సంఖ్య 5 లక్షలకు పైనే ఉంటుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆధారాలతో సహా ఓ కథాన్ని ప్రచురించింది. జావా, జావాస్క్రిప్ట్‌తో రూపొందించిన గూగుల్ ప్లస్‌లో ఉన్న బగ్ కారణంగా, యూజర్ల వ్యక్తిగత సమాచారం తిరస్కరణకు గురైందని పేర్కొంది. దీనిపై స్పందించిన గూగుల్, త్వరలో గూగుల్ ప్లస్ సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించింది.













