ట్రంప్ పై అమెరికన్ మహిళల ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళలు అమెరికాలో వివిధ ప్రాంతాలలోని నగరాలలో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. ట్రంప్ అధికారం చేపట్టిన నాటినుండి ఇలా మహిళలు, నిరసనల ర్యాలీలు చేపట్టటం ఇది రెండవసారి. గత ఏడాది కూడా మహిళలు నిరసనల ర్యాలీలు చేసారు. వాషింగ్టన్, న్యూయార్క్‌తో సహా పలు నగరాలలో లక్షలాది మహిళలు వీధులలో నిరసనలు తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపుతోందని, స్థానిక స్కూల్ బోర్డులలో, చట్ట సభలలో మహిళలకు ప్రాధాన్యత తగ్గిస్తోందని నిరసనకారుల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ద్రవ్యబిల్లు కాంగ్రెస్‌లో నెగ్గించకోలేకపోవటం, ప్రభుత్వ పాలసీలు మహిళలకు వ్యతిరేకంగా ఉండటం, ఆర్థిక మందగమనంతో పాటు ట్రంప్ తీరు అన్ని విషయాలలోనూ బాగాలేదని ఆయన వెంటనే పదవినుండి తొలగించాలని వేలాది మహిళలు అమెరికా అంతటా ర్యాలీలు నిర్వహించారు.













