30మంది యూఏఈ ఆమ్నెస్టీ బాధితులు నేడు తెలంగాణాకి రాక
– ప్రభుత్వం తరుపున స్వయంగా తీసుక వస్తున్నా మహేష్ బిగాల
– గల్ఫ్ బాధితులకు విమాన టికెట్స్ సమకూర్చిన ప్రభత్వ బృందం
గల్ఫ్ బాధితుల కొరకు యూఏఈ ప్రభుత్వం క్షమాబిక్ష ప్రకటించిన నేపథ్యంలో అవుట్ పాసులు లేక, పాస్ పోర్టులు లేక విమాన టికెట్స్ కొనలేక అసువులు బారిన గల్ఫ్ బాధితులను స్వయంగా తీసుకరావడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రభుత్వం తరుపున ప్రత్యేక బృందాన్ని పంపిన వియషం తెలిసిందే. గత 4 రోజులుగా అర్విందర్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వ బృంద పర్యటన విజయవంతంగా సాగుతుంది. 4వ రోజు వారు షార్జా లోని అన్ని లేబర్ క్యాంప్స్ పర్యటించి 30 మంది బాధితులకు అవుట్ పాసులు ఇప్పించి విమాన టికెట్స్ కొనిచ్చారు. వారిని స్వయంగా మహేష్ బిగాల మరియు నర్సింహా నాయుడులు తీసుకొని నేడు హైదరాబాద్ కు తీసుక రానున్నారు. హైదరాబాద్ కి వచ్చాక కూడా వారికీ ప్రభుత్వం తరుపున వాహనాలు సమకూర్చి వారి యొక్క ఊర్లకు పంపియ్యనున్న బృందం.
ఎన్నారై మంత్రివర్యులు కేటీర్ గారు గల్ఫ్ బాధితులు కొరకు చేస్తున్న సహాయక చర్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ 30 మంది తో ఇప్పటి వరకు వంద మంది దాక గల్ఫ్ బాధితులను ప్రభుత్వ ఖర్చులతో తెలంగాణ వచ్చినట్లు అయితది అని రషీద్, చిట్టి బాబు అన్నారు.ఇంకా మిగిలిన వారిని క్షమా బిక్ష గడువు ముగిసేలోగా తెలంగాణ తిరిగి రానున్నారు. గల్ఫ్ బాధితుల సమస్యలన్నీ సీఎం కెసిఆర్ గారి దృష్టికి తీసుక వెళ్లి వాటిని పరిష్కరించాలని కోరుతామని, ఈ నాలుగు రోజులు తమకు సహాయం చేసిన తెలంగాణ అన్ని సంఘాల నాయకులకు బృంద సభ్యులు తెలిపారు.













