Ram Gopal Varma :రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కు ముంబయి కోర్టు (Mumbai Court )మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసు (Cheque bounce case )కు సంబంధించి అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు వర్మపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది. 2018లో మహేశ్ చంద్ర (Mahesh Chandra) అనే వ్యక్తి వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు.






